సోషల్ మీడియా వచ్చాక హీరో, హీరోయిన్లు తమ వ్యక్తిగత విషయాలతో పాటు సినిమా అప్‌డేట్స్‌ను సైతం ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటున్నారు. దీంతో తమ అభిమాన తారలను లక్షలాది మంది ఫాలో అవుతున్నారు. అందులో సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వరుస హిట్లతో దూసుకుపోతున్న మహేశ్ బాబు తాజాగా సోషల్ మీడియాలో దూకుడు ప్రదర్శించారు. అతడిని ఫేస్‌బుక్‌లో ఫాలో అయ్యేవారి సంఖ్య 15 మిలియన్లు దాటింది. ఈ నేపథ్యంలో ఆయన అభిమానులు నెట్టింట సంబరాలు జరుపుకుంటున్నారు. దీంతో మహేశ్‌బాబు పేరు నెట్టింట మార్మోగిపోతోంది. మరో పక్క ఆయన యాడ్ షూటింగ్‌లో పాల్గొన్న ఫొటో కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.