Namaste NRI

తెలంగాణ భార‌త్‌కు రోల్ మోడల్‌గా నిలుస్తుంది : మ‌హేశ్ బిగాల

బీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్ ద్వారానే దేశంలో గుణాత్మ‌క మార్పు సాధ్య‌మ‌ని బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కో ఆర్డినేట‌ర్ మ‌హేశ్ బిగాల స్ప‌ష్టం చేశారు. ఫుట్‌బాల్ ప్ర‌పంచ క‌ప్‌-2022 పోటీల సంద‌ర్భంగా మ‌హేశ్ బిగాల ఖ‌తార్‌కు వెళ్లారు.  ఫుట్ బాల్ ప్రపంచ కప్ సందర్భంగా ఖతర్ విడుదల చేసిన కరెన్సీని ఈ సందర్భంగా మహేష్ బిగాలకు అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా మ‌హేశ్ బిగాల మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో చేపట్టిన అభివృద్ధి పథకాలు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయ‌ని తెలిపారు.

తెలంగాణ మోడల్ భార‌త్‌కు రోల్ మోడల్‌గా నిలుస్తుంద‌న్నారు. జాతీయ రాజకీయాల్లోకి రావాలనే కేసీఆర్ ఆలోచన నేటిది కాదాని జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాల్సిన అవసరాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ 2018 మార్చిలోనే ప్రగతిభవన్‌లో నిర్వ‌హించిన ఎన్నారైల‌న స‌మావేశంలో తెలిపార‌ని గుర్తు చేశారు. దేశంలో మార్పు కోసం ప్రయత్నిస్తానని, జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తానని కేసిఆర్ ప్రకటించిన సందర్భాన్ని గుర్తు చేశారు.

 టీఆర్ఎస్ ఖతర్ అధ్యక్షుడు శ్రీధర్ అబ్బగౌని మాట్లాడుతూ దేశ ప్రజలంతా తెలంగాణ వైపు చూస్తున్నారన్నారు. భారతదేశాన్ని దాదాపు 75 ఏండ్లు పాలించిన కాంగ్రెస్‌, బీజేపీలు సమాఖ్య స్ఫూర్తిని కాపాడటంలో, దేశాన్ని అభివృద్ధి పథాన నడిపించడంలో దారుణంగా విఫలమయ్యాయన్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లయినా దేశంలో విద్యుద్దీకరణకు నోచుకోని గ్రామాలు, మంచినీరు, రహదారులు లాంటి సౌకర్యాల్లేని గ్రామాలు, ఆవాస ప్రాంతాలు వేల సంఖ్యలో ఉన్నాయన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events