శ్రీకాళహస్తి స్థల పురాణం ఆధారంగా విష్ణు మంచు రూపొందిస్తున్న చిత్రం కన్నప్ప. ఆయన టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ సినిమాలో మోహన్‌లాల్, మోహన్‌బాబు, ప్రభాస్ వంటి అగ్ర తారలు భాగమవుతున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకుడు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఇదివరకే న్యూజిలాండ్‌లోని సుందరమైన లొకేషన్లలో 90 రోజుల పాటు తొలి షెడ్యూల్ చిత్రీకరణ జరిగింది. తాజాగా చిత్ర బృందం రెండో షెడ్యూల్‌ను మొదలుపెట్టింది. ఈ సందర్భంగా మంచు విష్ణు సోషల్‌మీడియాలో ఓ వీడియోను షేర్ చేశారు. న్యూజిలాండ్, థాయ్‌లాండ్, భారత్‌కు చెందిన అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు ఈ సినిమా కోసం పనిచేస్తు న్నారు. ఈ రెండో షెడ్యూల్లో ప్రధాన తారాగణం పాల్గొనగా కీలక ఘట్టాలను తెరకెక్కిస్తాం. ఓ అద్భుత దృశ్య కావ్యంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం అని మంచు విష్ణు పేర్కొన్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్ టైన్మెంట్ పతాకాలపై ఈ సినిమా తెరకెక్కుతున్నది.