Namaste NRI

ఆది పినిశెట్టి హీరోగా మరకతమణి 2 పూజతో ప్రారంభం

2017లో విడుదలైన మరకతమణి చిత్రానికి సీక్వెల్‌గా మరకతమణి 2 చిత్రం రూపొందుతున్నది. ఆది పినిశెట్టి, సత్యరాజ్‌, ప్రియా భవాని శంకర్‌ , నిక్కీ గల్రానీ పినిశెట్టి ప్రధానపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఆర్కే శరవణన్‌ దర్శకుడు. సుధన్‌ సుందరం, మనీష్‌ సింఘాల్‌, దుర్గారం చౌదరి, దేవ్‌, కేవీ దురై నిర్మాతలు. ఈ సినిమా షూటింగ్‌ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా చెన్నైలో పూజాకార్యక్రమాలతో లాంఛనంగా మొదలైంది. ముహూర్తపు సన్నివేశానికి హీరో కార్తీ క్లాప్‌ ఇవ్వగా, హీరో ఆర్య, దర్శకుడు వెంకట్‌ప్రభు కెమెరా.. రోలింగ్‌.. యాక్షన్‌ అంటూ షూటింగ్‌ను ప్రారంభించారు.

నిరవధికంగా చిత్రీకరణ జరుగుతుందని, త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విశేషాలు రివీల్‌ చేస్తామని మేకర్స్‌ తెలిపారు. మునిష్కాంత్‌, ఆనందరాజ్‌, డానీ, అరుణ్‌రాజా కామరాజ్‌, మురుగానందం తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: పీవీ శంకర్‌, సంగీతం: ధిబు నినాన్‌ థామస్‌, నిర్మాణం: ప్యాషన్‌ స్టూడియోస్‌, దంగల్‌ టీవీ, ఆర్‌డిసి మీడియా, యాక్సెస్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ, గుడ్‌ షో సంస్థలు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events