Namaste NRI

మార్షల్ లా చట్ట ఉల్లంఘన.. దక్షిణ కొరియా అధ్యక్షుడిపై!

అభిశంసనకు గురైన దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌పై నేరాభియోగాలను ప్రాసిక్యూటర్లు నమోదు చేశారు. గత ఏడాది డిసెంబరు 3న 6 గంటలపాటు ఆయన దేశంలో మార్షల్‌ లా విధించి, తిరుగుబాటుకు పాల్పడిన ట్లు ఈ కేసులో పేర్కొన్నారు. ఈ నేరారోపణలు రుజువైతే ఆయనకు మరణ శిక్ష లేదా యావజ్జీవ కారాగారవాస శిక్ష పడవచ్చు.

మార్షల్‌ లా విధించిన తర్వాత యూన్‌ను పార్లమెంటు అభిశంసించింది. ఆ తర్వాత ఆయనను అరెస్ట్‌ చేశారు. ఆయన ను తిరిగి దేశాధ్యక్షునిగా పునరుద్ధరించాలా? లేక డిస్మిస్‌ చేయాలా? అనే అంశాన్ని రాజ్యాంగ న్యాయస్థానం పరిశీలిస్తున్నది. మరోవైపు క్రిమినల్‌ జ్యుడిషియల్‌ ప్రొసీడింగ్స్‌ కొనసాగుతున్నాయి. అయితే పరిపాలనలో భాగంగానే తాను చట్టబద్ధంగా మార్షల్‌ లా విధించానని యూన్‌ తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events