
రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం మాస్ జాతర. మనదే ఇదంతా ఉపశీర్షిక. శ్రీలీల కథానాయిక. భాను భోగవరపు దర్శకుడు. సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మాతలు. ఇప్పటికే విడుదలైన పాటలు, ప్రచార చిత్రాలకు అద్భుతమైన స్పందన లభిస్తున్నదని, వింటేజ్ వైబ్స్, కమర్షియల్ హంగులు కలబోసిన పర్‌ఫెక్ట్ మాస్ ఎంటర్‌టైనర్ ఇదని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రాన్ని వినాయక చవితి సందర్భంగా ఆగస్ట్ 27న విడుదల చేయబోతున్నామని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: విధు అయ్యన్న, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, దర్శకత్వం: భాను భోగవరపు.
