రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రం ధమాకా. డబుల్ ఇంపాక్ట్ అనేది ఉప శీర్షిక. శ్రీలీల కథానాయిక. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. టి.జి.విశ్వప్రసాద్ నిర్మాత. వినాయక చవితి సందర్భంగా ఈ నెల 31న సినిమా ప్రచార చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు సినీ వర్గాలు తెలిపాయి. ఉపశీర్షికకు తగ్గట్టుగగానే కథానాయకుడు రవితేజ పాత్ర ప్రేక్షకులపై ప్రత్యేకమైన ప్రభావం చూపిస్తుంది. వాణిజ్యాంశాలతో కూడిన ఈ కథ ఇంటిల్లిపాదికీ నచ్చేలా ఉంటుందని సినీ వర్గాలు స్పష్టం చేశారు. ఈ చిత్రాన్ని ప్రసన్న కుమార్ కథ, సంభాషణలు అందించారు. భీమ్స్ సిసిరోలియో స్వరకర్త.
