Skip to main content

Namaste NRI

మాస్‌ మహారాజా ధమాకా రొమాంటిక్‌ గ్లింప్స్‌

రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రం ధమాకా. డబుల్‌ ఇంపాక్ట్‌ అనేది ఉప శీర్షిక. శ్రీలీల కథానాయిక. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. టి.జి.విశ్వప్రసాద్‌ నిర్మాత. వినాయక చవితి సందర్భంగా ఈ నెల 31న సినిమా ప్రచార చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు సినీ వర్గాలు తెలిపాయి. ఉపశీర్షికకు తగ్గట్టుగగానే కథానాయకుడు రవితేజ పాత్ర ప్రేక్షకులపై ప్రత్యేకమైన ప్రభావం చూపిస్తుంది. వాణిజ్యాంశాలతో కూడిన ఈ కథ ఇంటిల్లిపాదికీ నచ్చేలా ఉంటుందని సినీ వర్గాలు స్పష్టం చేశారు. ఈ చిత్రాన్ని ప్రసన్న కుమార్‌ కథ, సంభాషణలు అందించారు. భీమ్స్‌ సిసిరోలియో స్వరకర్త.

Social Share Spread Message

Latest News