Namaste NRI

సంక్రాంతి రేసులో మాస్ మహారాజ .. రవితేజ కొత్త సినిమా స్టార్ట్

రవితేజ 76వ చిత్రం ప్రారంభమైంది. కిషోర్‌ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్‌మెంట్‌ పోస్టర్‌లో రవితేజ ైస్టెలిష్‌గా కనిపిస్తున్నారు.వినోదప్రధానంగా సాగే కుటుంబ కథా చిత్రమిదని, రవితేజ పాత్ర కొత్తదనంతో కూడుకొని ఉంటుందని మేకర్స్‌ తెలిపారు.

 ఈ నెల 16 నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభంకానుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: ప్రసాద్‌ మూరెళ్ల, సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో, ప్రొడక్షన్‌ డిజైనర్‌: ఏ.ఎస్‌.ప్రకాష్‌, నిర్మాత: సుధాకర్‌ చెరుకూరి, రచన-దర్శకత్వం: కిషోర్‌ తిరుమల.

Social Share Spread Message

Latest News