అభినవ్ గోమఠం కథానాయకునిగా రూపొందుతోన్న చిత్రం మస్తు షేడ్స్ ఉన్నయ్‌రా. తిరుపతిరావు ఇండ్ల దర్శకుడు. భవాని కాసుల, ఆరెమ్ రెడ్డి, ప్రశాంత్.వి నిర్మాతలు. ఈ సినిమా ట్రైలర్‌ని హీరో నిఖిల్ చేతుల మీదుగా విడుదల చేశారు. సినిమా ఘనవిజయం సాధించి, అందరికీ మంచి పేరు తీసుకురావాలని నిఖిల్ చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. ఇది నా జీవితంలో స్పెషల్ మూమెంట్. నాకీ అవకాశం ఇచ్చిన దర్శకుడు తిరుపతిరావుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. హీరోగా నాకు చాలా ఆఫర్లు వచ్చాయి. తగిన కథ కోసం ఇన్నాళ్లూ చూశాను. ఇది నాకు తగిన కథ. అందుకే ఓకే చేశాను అని అభినవ్ గోమఠం అన్నారు. కంటెం ట్ బావుంటే చిన్న సినిమానైనా ప్రేక్షకులు అదరిస్తారని తన నమ్మకమని, ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకు లకు నచ్చుతుందని తిరుపతిరావు నమ్మకం వ్యక్తం చేశారు. ఈ నెల 23న సినిమా విడుదల కానుందని, ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్మకంతో ఉన్నామని నిర్మాతలు తెలిపారు.