Namaste NRI

24న జీ 7 దేశాల భేటీ

ఈ నెల 24న జీ`7 దేశాల సమావేశం జరగనుంది. ఈ సారి సమావేశానికి బ్రిటన్‌ అధ్యక్షత వహించనుంది. తాలిబన్ల ఆక్రమణ తర్వాత అఫ్గానిస్థాన్‌లో జరుగుతున్న పరిణామాలపై వర్చువల్‌ విధానంలో నిర్వహించే ఈ భేటీ జరగనుంది. ఈ భేటీలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌, జర్మనీ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమ్మోన్యుయెల్‌ మాక్రన్‌, ఇటలీ ప్రధాని మారియో డ్రఘి తదితరులు పాల్గొననున్నారు. అఫ్గాన్‌కు సహాయ సహకారాల కొనసాగింపు, ఇతర దేశాల పౌరుల సురక్షిత తరలింపు, మానవ సంక్షోభ నివారణ తదితర అంశాలపై చర్చించనున్నట్లు బోరిస్‌ జాన్సన్‌ తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events