Namaste NRI

మెగాస్టార్‌ 156 టైటిల్‌ వచ్చేసింది

మెగాస్టార్‌ చిరంజీవి మళ్లీ సోషియోఫాంటసీ మూవీ చేస్తున్నాడు. యంగ్‌ డైరెక్టర్‌ వశిష్ఠ ఈ సినిమాను తెరకెక్కి స్తున్నాడు. ఈ సినిమాను అనౌన్స్‌ చేసినప్పటి నుంచి ఈ సినిమా ఎలా ఉండబోతుందా? అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మెగా 156 సినిమా ఎప్పుడు మొదలవుతుందా? ఈ సినిమాలో చిరంజీవి ఎలా కనిపిస్తారా? అని మెగా ఫ్యాన్స్‌ ఉత్కంఠగా చూస్తున్నారు. ఈ క్రమంలో మెగా ఫ్యాన్స్‌కు చిత్ర బృందం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ను రివీల్‌ చేశారు. ఈ సినిమా టైటిల్‌ను ప్రకటిస్తూ యూవీ క్రియేషన్స్‌ ఒక వీడియో గ్లింప్స్‌ను రిలీజ్‌ చేసింది.

చిరంజీవి, వశిష్ట కాంబినేషన్‌లో వస్తున్న మెగా 156 సినిమాకు ముల్లోక వీరుడు, విశ్వంభర టైటిల్స్‌ను పరిశీలిస్తున్నట్లు చాలా రోజులుగా వార్తలు వచ్చాయి. జగదేక వీరుడు అతిలోక సుందరి టైటిల్‌కు దగ్గరగా ఉండటంతో, వీటిలో ముల్లోక వీరుడు అనే టైటిల్‌ను కన్ఫార్మ్‌ చేశారని కూడా ప్రచారం జరిగింది. కానీ ఈ ఊహగానాలు అన్నింటినీ బ్రేక్‌ చేస్తూ చిత్ర యూనిట్‌ సినిమా టైటిల్‌ను రివీల్‌ చేసింది. విశ్వంభర టైటిల్‌ను కన్ఫార్మ్‌ చేస్తూ ఓ వీడియో గ్లింప్స్‌ను వదిలింది. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు కూడా ప్రకటించింది. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ గ్లింప్స్‌ ఇప్పుడు మెగా ఫ్యాన్స్‌ను ఫుల్‌ ఖుషీ చేస్తోంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events