అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ టంప్ను ఆయన సతీమణి మెలానియా ట్రంప్ ఇష్టపడటం లేదు. దేశాధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థిని కమల హారిస్ గెలవాలని ఆమె కోరుకుంటున్నారు. కమలకు ఆమె రహస్యంగా మద్దతిస్తున్నారు. ట్రంప్ మాజీ వైట్ హౌస్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ ఆంథోనీ స్కరముచి ఈ వివరాలను తెలిపారు.హ్యారిస్ విజయం గురించి అత్యంత ఉత్సాహంతో ఎదురు చూస్తున్న వ్యక్తి మెలానియా అని చెప్పారు. ట్రంప్ నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో మెలానియా సాదాసీదాగా పొల్గొంటున్న నేపథ్యంలో స్కరముచి ఈ వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ కోసం ఎన్నికల నిధుల సేకరణలో మెలానియా తక్కువగా పాల్గొన్నారు. స్కరముచి ఆరోపణలను డొనాల్డ్ ట్రంప్ తోసిపుచ్చారు.