టాలీవుడ్ యువ హీరో వరుణ్‌తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం గాండీవధారి అర్జున. ప్రవీణ్ సత్తారు దర్శకుడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మించారు. యాక్షన్ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. విమలారామన్, నాజర్, వినయ్ రాయ్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలోని నీ జతై అనే రొమాంటిక్ పాటను విడుదల చేశారు. మిక్కీ జే మేయర్ స్వరపరచిన ఈ పాటను నకుల్ భయంకర్ ఆలపించారు. ప్రేమికుల మనసులోని భావాలకు అద్దం పడుతూ చక్కటి మెలోడీతో ఈ పాట సాగింది. ఈ సినిమాలో వరుణ్‌తేజ్ గూఢచారి పాత్రలో కనిపించనున్నారు. దేశరక్షణ కోసం ఆయన చేపట్టిన ఆపరేషన్ ఏమిటన్నది ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుందని చిత్ర బృందం పేర్కొంది. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో యాక్షన్ ఘట్టాలు హైలైట్‌గా నిలుస్తాయని దర్శకుడు పేర్కొన్నారు. వరుణ్‌తేజ్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కించామని, ఐరోపా దేశాలతో పాటు అమెరికాలో
