Skip to main content

Namaste NRI

గాంఢీవధారి అర్జున నుండి మెలోడీ సాంగ్ నీ జతై

టాలీవుడ్ యువ హీరో  వరుణ్‌తేజ్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం గాండీవధారి అర్జున. ప్రవీణ్‌ సత్తారు దర్శకుడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై  బి.వి.ఎస్‌.ఎన్‌. ప్రసాద్‌ నిర్మించారు. యాక్షన్‌ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్‌ మ్యూజిక్‌ అందిస్తున్నాడు. విమలారామన్‌, నాజర్‌, వినయ్‌ రాయ్‌ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలోని నీ జతై  అనే రొమాంటిక్‌ పాటను విడుదల చేశారు. మిక్కీ జే మేయర్‌ స్వరపరచిన ఈ పాటను నకుల్‌ భయంకర్‌ ఆలపించారు. ప్రేమికుల మనసులోని భావాలకు అద్దం పడుతూ చక్కటి మెలోడీతో ఈ పాట సాగింది. ఈ సినిమాలో వరుణ్‌తేజ్‌ గూఢచారి పాత్రలో కనిపించనున్నారు. దేశరక్షణ కోసం ఆయన చేపట్టిన ఆపరేషన్‌ ఏమిటన్నది ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుందని చిత్ర బృందం పేర్కొంది. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో యాక్షన్‌ ఘట్టాలు హైలైట్‌గా నిలుస్తాయని దర్శకుడు పేర్కొన్నారు. వరుణ్‌తేజ్‌ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కించామని, ఐరోపా దేశాలతో పాటు అమెరికాలో

Social Share Spread Message

Latest News