నరేష్ అగస్త్య, రియా సుమన్, ప్రియాంక, హర్ష, బ్రహ్మాజీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా మెన్ టూ. ఈ చిత్రాన్ని లాంటెన్ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై మౌర్య సిద్ధవరం నిర్మిస్తున్నారు. శ్రీకాంత్ జి రెడ్డి దర్శకుడు. హైదరాబాద్‌లో ఈ చిత్ర టీజర్ విడుదల కార్యక్రమం హీరో శర్వానంద్ చేతుల మీదుగా జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీకాంత్ జి రెడ్డి మాట్లాడుతూ ఈ కథతో సినిమా తీయాలని ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఏదో కాంట్రవర్సీ చేయాలని చూస్తున్నాడు అనుకున్నారు. నా కథను, విజన్‌ను నమ్మిన ప్రొడ్యూసర్ మౌర్యకు థాంక్స్. ఈ మూవీ మంచి ఎంటర్‌టైనర్ అవుతుంది అని అన్నారు. శర్వానంద్ మాట్లాడుతూ మౌర్య నాకు మంచి మిత్రుడు. నాతో కలిసి రణరంగం సినిమాలో నటించాడు. అతను ఈ సినిమా గురించి చెప్పినప్పుడు ప్రొడక్షన్ ఎందుకు అన్నాను.నేనూ గతంలో ఇలాగే నిర్మాతగా చేతులు కాల్చుకున్నాను. కానీ సినిమా మీద ఇష్టంతో వెనకడుగు వేయకుండా పూర్తి చేశాడు అన్నారు. ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలి. ప్రొడ్యూసర్‌గా కూడా మౌర్య సక్సెస్ అయ్యాడని, బిజినెస్ బాగా జరిగిందని విన్నా. టీమ్‌కి కంగ్రాజులేషన్స్ . కష్టపడితే, మంచి సినిమా చేస్తే తప్పక అందరూ ఆదరిస్తారని నమ్ముతున్నా అని అన్నారు. హీరో నరేష్ అగస్త్య మాట్లాడుతూ ఈ సినిమా పేరు మెన్టూ అని పెట్టాం కానీ అమ్మాయిలకే ఎక్కువ నచ్చుతుందని అనుకుంటున్నా. ఈ చిత్రంలో హీరోగా అవకాశమిచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్ అన్నారు. నిర్మాత మౌర్య సిద్ధవరం మాట్లాడుతూ ఒక మంచి చిత్రాన్ని చేశామని నమ్ముతున్నాం. త్వరలోనే సినిమాను విడుదల చేయబోతున్నాం. మీరంతా ఆదరించాలని కోరుకుంటున్నాం అన్నారు