Namaste NRI

మెన్ టూ సినిమాను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు: శర్వానంద్

నరేష్ అగస్త్య, రియా సుమన్, ప్రియాంక, హర్ష, బ్రహ్మాజీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా మెన్ టూ. ఈ చిత్రాన్ని లాంటెన్ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై మౌర్య సిద్ధవరం నిర్మిస్తున్నారు. శ్రీకాంత్ జి రెడ్డి దర్శకుడు. హైదరాబాద్‌లో ఈ చిత్ర టీజర్ విడుదల కార్యక్రమం హీరో శర్వానంద్ చేతుల మీదుగా జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీకాంత్ జి రెడ్డి మాట్లాడుతూ ఈ కథతో సినిమా తీయాలని ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఏదో కాంట్రవర్సీ  చేయాలని చూస్తున్నాడు అనుకున్నారు. నా కథను, విజన్‌ను నమ్మిన ప్రొడ్యూసర్ మౌర్యకు థాంక్స్. ఈ మూవీ మంచి ఎంటర్‌టైనర్‌  అవుతుంది అని అన్నారు. శర్వానంద్ మాట్లాడుతూ మౌర్య నాకు మంచి మిత్రుడు. నాతో కలిసి రణరంగం సినిమాలో నటించాడు. అతను ఈ సినిమా గురించి చెప్పినప్పుడు ప్రొడక్షన్ ఎందుకు అన్నాను.నేనూ గతంలో ఇలాగే నిర్మాతగా చేతులు కాల్చుకున్నాను. కానీ సినిమా మీద ఇష్టంతో వెనకడుగు వేయకుండా పూర్తి చేశాడు అన్నారు. ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలి. ప్రొడ్యూసర్‌గా  కూడా మౌర్య సక్సెస్ అయ్యాడని, బిజినెస్ బాగా జరిగిందని విన్నా. టీమ్‌కి కంగ్రాజులేషన్స్ . కష్టపడితే, మంచి సినిమా చేస్తే తప్పక అందరూ ఆదరిస్తారని నమ్ముతున్నా అని అన్నారు. హీరో నరేష్ అగస్త్య మాట్లాడుతూ ఈ సినిమా పేరు మెన్టూ అని పెట్టాం కానీ అమ్మాయిలకే ఎక్కువ నచ్చుతుందని అనుకుంటున్నా. ఈ చిత్రంలో హీరోగా అవకాశమిచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్ అన్నారు. నిర్మాత మౌర్య సిద్ధవరం మాట్లాడుతూ ఒక మంచి చిత్రాన్ని చేశామని నమ్ముతున్నాం. త్వరలోనే సినిమాను విడుదల చేయబోతున్నాం. మీరంతా ఆదరించాలని కోరుకుంటున్నాం అన్నారు

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events