సూపర్ స్టార్ రజినీకాంత్ టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం జైలర్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. జైలర్ చిత్రంలో మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్, టాలీవుడ్ యాక్టర్ సునిల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే జైలర్ సెట్స్ నుంచి విడుదలైన మోహన్ లాల్, సునిల్ స్టిల్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా బాటియా మరో కీ రోల్ చేస్తోంది.తాజాగా మేకర్స్ సెట్స్ నుంచి తమన్నా లుక్‌ను విడుదల చేశారు. తమన్నా స్టైలిష్ గ్లామరస్ అవతార్‌లో కనిపిస్తోంది. ఇంతకీ ఈ బ్యూటీ ఎలాంటి పాత్రలో కనిపించబోతుందనేది రానున్న రోజుల్లో క్లారిటీ రానుంది. మోహన్‌లాల్, సునిల్, తమన్నా లుక్స్ ను గమనిస్తే, డిఫరెంట్ పీరియాడిక్ బ్యాక్ డ్రాప్లో ఈ ముగ్గురు ఉండబోతున్నాయని తెలుస్తోంది. అయితే దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.యాక్షన్ కామెడీ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న చిత్రంలో కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్, రమ్యకృష్ణ, యోగిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు.