Skip to main content

Namaste NRI

జైలర్ లో మిల్కీ బ్యూటీ లుక్

సూపర్ స్టార్ రజినీకాంత్ టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం జైలర్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఈ  చిత్రానికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు.  జైలర్ చిత్రంలో మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్, టాలీవుడ్ యాక్టర్ సునిల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే జైలర్ సెట్స్ నుంచి విడుదలైన మోహన్ లాల్, సునిల్ స్టిల్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా బాటియా మరో కీ రోల్ చేస్తోంది.తాజాగా మేకర్స్ సెట్స్ నుంచి తమన్నా లుక్ను విడుదల చేశారు. తమన్నా స్టైలిష్ గ్లామరస్ అవతార్లో కనిపిస్తోంది. ఇంతకీ ఈ బ్యూటీ ఎలాంటి పాత్రలో కనిపించబోతుందనేది రానున్న రోజుల్లో క్లారిటీ రానుంది. మోహన్లాల్, సునిల్, తమన్నా లుక్స్ ను గమనిస్తే, డిఫరెంట్ పీరియాడిక్ బ్యాక్ డ్రాప్లో ఈ ముగ్గురు ఉండబోతున్నాయని తెలుస్తోంది. అయితే దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.యాక్షన్ కామెడీ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న చిత్రంలో కన్నడ స్టార్ హీరో శివరాజ్కుమార్, రమ్యకృష్ణ, యోగిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Social Share Spread Message

Latest News