విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి సూపర్ హిట్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న భారీ చిత్రం ఎఫ్ 3. తమన్నా భాటియా మెహ్రీనా పిర్జాదా, సోనాన చౌహాన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాలోని రెండో పాటని ఈ నెల 22న విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. ఆ పాట ప్రోమోని కలర్‌పుల్‌గా ప్రేక్షకుల్ని కనవిందు చేస్తోంది. ఈ గీతంలో నాయకానాయికలతో పాటు సునీల్ సందడి చేసినట్లు తెలుస్తోంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం మే 27న విడుదల కానుంది.