Skip to main content

Namaste NRI

ఎఫ్‌3  నుంచి సెకండ్‌ సింగిల్‌ కు మిలియన్‌ వ్యూస్‌ 

విక్టరీ వెంకటేష్‌, మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌, అనిల్‌ రావిపూడి సూపర్‌ హిట్‌ కాంబినేషన్‌ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న భారీ చిత్రం ఎఫ్‌ 3. తమన్నా భాటియా మెహ్రీనా పిర్జాదా, సోనాన చౌహాన్‌ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌ అందిస్తున్నారు. ఈ సినిమాలోని రెండో పాటని ఈ నెల 22న విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. ఆ పాట ప్రోమోని కలర్‌పుల్‌గా ప్రేక్షకుల్ని కనవిందు చేస్తోంది. ఈ గీతంలో నాయకానాయికలతో పాటు సునీల్‌ సందడి చేసినట్లు తెలుస్తోంది.   షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులలో బిజీగా ఉంది. అవుట్‌ అండ్‌ అవుట్‌ కామెడీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం మే 27న విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News