

మే 31 శనివారం నాడు అమెరికా లోని ఒరెగాన్ రాష్ట్రంలో పోర్ట్లాండ్ టీడీపీ మహానాడు చాలా అట్టహాసం గా ఆర్భాటం గా జరిగింది. ఈసారి మహిళలు, యువత తమ అభిమాన పార్టీ కోసం ముందు ఉండి నడిపించారు. పెద్ద NTR పుట్టినరోజు, టీడీపీ గత సంవత్సర కాలం పాలన మరియు బాలయ్య బాబు పద్మ భూషణ్ వచ్చిన సందర్భం గా సంబరాలు చేసుకున్నారు.


దీన్లో భాగం గా మా తెలుగు తల్లికి పాటకి మహిళలు, చిన్నారులు బాలయ్య బాబు పాటలకి స్టెప్పులు వేసి అలరించారు. టీడీపీ పాలనలో భాగంగా చేపట్టిన ఎన్నో వ్యవసాయ ఆధారిత మరియు IT related కార్యక్రమాల గురించి ప్రసంగించారు. మంచి విందు భోజనం, బాలయ్యబాబు, టీడీపీ, మహానాడు మీద క్విజ్ ఇంకా మరెన్నో ఆహ్లాదభరితమైన కార్యక్రమాలు జరిగాయి. NRIs నరహరి రామినేని, మారుతి యరపతినేని టీడీపీ చేస్తున్న ప్రజోపయోగ కార్యక్రమాల గురించి ప్రసంగించారు.

