కువైట్‌లో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిండెంట్, మంత్రి కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీఆర్ఎస్ కువైట్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఈ సందర్బంగా కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారందరికి మంత్రి కేటీఆర్ ఒక్క ట్వీట్‌తోనే అండగా నిలుస్తున్నారని ప్రశంసించారు. కేటీఆర్ ఆయురారోగ్యాలతో నిండూ నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జాగృతి కువైట్ అధ్యక్షుడు ముత్యాల వినయ్ కుమార్, మహ్మద్ జలాల్, అశోక్ చార్య, రవి సుదగాని, ప్రమోద్ కుమార్ మర్క, అయ్యప్ప, రవి గన్నరపు, సుబాన్ సోహీల్, సురేష్ గౌడ్ పాల్గొన్నారు.