Skip to main content

Namaste NRI

కువైట్‌లో మంత్రి కేటీఆర్‌ పుట్టినరోజు వేడుకలు

కువైట్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిండెంట్‌, మంత్రి కేటీఆర్‌ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ కువైట్‌ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి.  ఈ సందర్బంగా కువైట్‌ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారందరికి మంత్రి కేటీఆర్‌ ఒక్క ట్వీట్‌తోనే  అండగా నిలుస్తున్నారని ప్రశంసించారు. కేటీఆర్‌ ఆయురారోగ్యాలతో నిండూ నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జాగృతి కువైట్‌ అధ్యక్షుడు ముత్యాల వినయ్‌ కుమార్‌, మహ్మద్‌ జలాల్‌, అశోక్‌ చార్య, రవి సుదగాని, ప్రమోద్‌ కుమార్‌ మర్క,  అయ్యప్ప, రవి గన్నరపు,  సుబాన్‌ సోహీల్‌,  సురేష్‌ గౌడ్‌ పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News