తెలంగాణ ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అట్లాంటాలోని చారిత్రాత్మక డా. మార్టిన్ లూథర్ కింగ్ సెంటర్‌ను సందర్శించారు. గాంధీ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా (జీఎఫ్‌యూఎస్‌ఏ) సంస్థ ఆహ్వానం మేరకు వెళ్లిన ఆయన అక్కడి మహాత్మా గాంధీ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. నల్లజాతీయుల హక్కుల పోరాడి న యోధుడు మార్టిన్ లూథర్ కింగ్ కు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సర్వ కాలాల్లోనూ అనుసరించదగిన సందేశాన్ని మహాత్మాతుడు ప్రపంచానికి అందించారని అన్నారు. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, గాంధీ సందేశాలు నేటి తరంలోనూ అనుసరణీయమని అన్నారు.


అంతకుమునుపు, జీఎఫ్‌యూఎస్‌ఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆంటొనీ థాలియన్, సంస్థ చైర్మన్ సుభాష్ రాజ్దాన్ మంత్రి శ్రీధర్ బాబును సాదరంగా ఆహ్వానించారు. మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన నాటి మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు. విగ్రహ ఏర్పాటుకు సహకరించిన భారతీయ రాయబార కార్యాలయం, ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్, ఇతర భారతీయ సంఘాలు, నేషనల్ పార్క్ నిర్వాహకులకు సుభాష్ రాజ్దాన్ ధన్యవాదాలు తెలిపారు. జీఎఫ్‌యూఎస్‌ఏ మీడియా డైరెక్టర్ రవి పొనంగీ, మంత్రిని స్థానికుల కు పరిచయం చేశారు. ఈ తరంలో గొప్ప రాజకీయ నేతల్లో మంత్రి ఒకరు ప్రశంసించారు. ఉన్నత విద్యావంతుడని, డైనమిక్ లీడర్ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎన్నారైలు పాల్గొన్నారు.


