తెలంగాణ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను అమెరికాకు చెందిన డే స్ప్రింగ్ క్రిస్టియన్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. ఇండో`ఇజ్రాయెల్ ఫ్రెండ్‌షిప్ అసోసియేషన్ 28వ వార్షికోత్సవాల్లో ఈ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ భారత్`ఇజ్రాయెల్ మధ్య స్నేహపూర్వక వాతావరణం ఏర్పరిచేందుకు అసోసియేషన్ విశేషంగా కృషి చేస్తున్నదని చెప్పారు. ఇరు దేశాల సంస్కృతి, సంప్రదాయాలను ఓకే వేదికపైకి తీసుకురావడం అభినందనీయమని తెలిపారు. అనంతరం వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన పలువురికి డే స్ప్రింగ్ క్రిస్టియన్ యూనివర్సిటీ తరపున డాక్టరేట్లను ప్రదానం చేశారు.