ప్రపంచంలోనే తొలిసారి నిర్వహించిన మిస్ ఏఐ పోటీల్లో మొరాకోకు చెందిన ఇన్‌ఫ్లుయెన్సర్ కెంజాలేలి విజేతగా నిలిచి కిరీటాన్ని అందుకుంది. 1500 మంది కంప్యూటర్ మాడిఫైడ్ మోడళ్లను వెనక్కి నెట్టి తొలి వర్చువల్ అందాల పోటీ విజేతగా నిలిచింది. మానవుల్ల్లా తనకు భావోద్వేగాలు తెలియనప్పటికీ విజయం సాధించినందుకు ఉత్సాహంగా ఉందని కెంజాలేలి పేర్కొన్నది. విజేతగా నిలిచిన ఆమెకు 20 వేల డాలర్ల ప్రైజ్‌మనీ దక్కింది. ఫుడ్, కల్చర్, ట్రావెల్, ఫ్యాషన్, బ్యూటీ వంటివాటిపై వీడియోలు చేస్తుంటుంది. మొరాకో సంస్కృతిని గర్వంగా ప్రదర్శించడమే తన ఆశయమని లేలి తెలిపింది.
మహిళా పురోగతి, పర్యావరణాన్ని కాపాడడం, పాజిటివ్ రోబో కల్చర్‌పై అవగాహన పెంచేందుకు ఈ విజయం ద్వారా వచ్చిన పేరును ప్రఖ్యాతు లను ఉపయోగించుకుంటానని వాగ్దానం చేసింది. ఏఐ అనేది మానవ సామర్థ్యాలను మరింత పెంచేందుకు రూపొందించబడిన సాధనం తప్ప వారిని భర్తీ చేసేది కాదని కెంజాలేలి స్పష్టం చేసింది. ఈ ఏఐ ముద్దు గుమ్మను ఫోనిక్స్ ఏఐ సీఈవో మెరియం బెస్సా సృష్టించారు.