Namaste NRI

భార‌త్‌లో ప్ర‌పంచ సుంద‌రి పోటీలు.. ఎక్క‌డంటే?

ప్ర‌పంచ సుంద‌రి పోటీల‌కు ఈసారి భార‌త్ ఆథిత్యం ఇవ్వ‌నుంది. భార‌త్‌లో 28 ఏండ్ల నిర్వ‌హించ‌బ‌డుతున్న ఈ పోటీలు ఢిల్లీ, ముంబై వేదిక‌గా కొన‌సాగ‌నున్నాయి. ఈ ఈవెంట్‌ను ప్ర‌పంచ వ్యాప్తంగా టెలికాస్ట్ చేయ‌నున్నా రు. ఫిబ్ర‌వ‌రి 18 నుంచి మార్చి 9వ తేదీ వ‌ర‌కు 71వ ప్ర‌పంచ సుంద‌రి పోటీల‌ను నిర్వ‌హించ‌నున్నారు. ఫైన‌ల్స్ మార్చి 9న ముంబైలోని జియో వ‌రల్డ్ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్ వేదిక‌గా రాత్రి 7:30 నుంచి 10:30 వ‌ర‌కు జ‌ర‌గ‌నున్నాయి. ఈ మేర‌కు మిస్ వ‌ర‌ల్డ్ ఆర్గ‌నైజేష‌న్ చైర్‌ప‌ర్స‌న్, సీఈవో జులియా మోర్లే అధికారికంగా ప్ర‌క‌టించారు. మిస్ వ‌రల్డ్ ఆతిథ్య దేశంగా భార‌త్‌ను ప్ర‌క‌టిస్తున్నందుకు సంతోషంగా ఉంద‌న్నారు. అందం, వైవిధ్యం, సాధికార‌త క‌ల‌గ‌లిపిన ఈ అద్భుత వేడుక‌ను ఆస్వాదించేందుకు సిద్ధం కావాల‌ని మోర్లే పిలుపునిచ్చారు. భార‌త్‌లో చివ‌రి సారిగా 1996లో బెంగ‌ళూరు వేదిక‌గా ప్ర‌పంచ సుంద‌రి పోటీల‌ను నిర్వ‌హించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events