
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. రెండు రోజుల పాటు ఆయన సౌదీలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో సౌదీ బయల్దేరి వెళ్లారు. ఈ సందర్భంగా ప్రధానికి సౌదీ ప్రభుత్వం ప్రత్యేకంగా స్వాగతం పలికింది. మోదీ ప్రయాణిస్తోన్న విమానం ఆ దేశ గగనతలంలోకి ప్రవేశించగానే, రాయల్ సౌదీ ఎయిర్‌ఫోర్స్ కు చెందిన ఎఫ్-15 విమానాలు దానిని ఎస్కార్ట్‌గా వచ్చాయి. మోదీ విమానానికి ఇరువైపులా మూడేసి చొప్పున ఆరు జెట్ ఫైటర్లు ఎస్కార్ట్‌గా నిలిచి స్వాగతం పలికాయి.
