Skip to main content

Namaste NRI

గగనతలంలో మోదీ అపూర్వ స్వాగతం

 ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. రెండు రోజుల పాటు ఆయన సౌదీలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో సౌదీ బయల్దేరి వెళ్లారు. ఈ సందర్భంగా ప్రధానికి సౌదీ ప్రభుత్వం ప్రత్యేకంగా స్వాగతం పలికింది. మోదీ ప్రయాణిస్తోన్న విమానం ఆ దేశ గగనతలంలోకి ప్రవేశించగానే,  రాయల్‌ సౌదీ ఎయిర్‌ఫోర్స్‌ కు చెందిన ఎఫ్‌-15 విమానాలు దానిని ఎస్కార్ట్‌గా వచ్చాయి. మోదీ విమానానికి ఇరువైపులా మూడేసి చొప్పున ఆరు జెట్ ఫైటర్లు ఎస్కార్ట్‌గా నిలిచి స్వాగతం పలికాయి.

Social Share Spread Message

Latest News