మంచు విష్ణు కథానాయకుడిగా తెరకెక్కుతున్న భక్తిరస ప్రధాన చిత్రం కన్నప్ప. శ్రీకాళహస్తి స్థలపురాణం ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ముఖేష్ కుమార్ దర్శకత్వం. ఈ చిత్రాన్ని మంచు మోహన్‌బాబు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మోహన్‌లాల్, అక్షయ్‌కుమార్, ప్రభాస్, శరత్‌కుమార్ వంటి అగ్ర తారలు భాగమవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా నుంచి మోహన్‌లాల్ లుక్‌ను విడుదల చేశారు.
ఇందులో ఆయన కిరాట అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఫస్ట్‌లుక్‌లో మోహన్‌లాల్ గంభీరంగా కనిపిస్తున్నారు. పోరాట యోధుడిగా కిరాట పాత్ర కథాగమనంలో కీలకంగా ఉంటుందని మేకర్స్ తెలిపారు. విజువల్ వండర్‌గా ఆధ్యాత్మిక, భక్తి ప్రధాన అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని ద ర్శకుడు తెలిపారు. ఏప్రిల్ 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.