ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో నెల నెలా తెలుగు వెలుగు పేరిట జరిగే సాహిత్య సమావేశాన్ని ఈ నెల 26న నిర్వహించనున్నారు. ఈ 45వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశం భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7.30కు ప్రారంభమవుతుందని నిర్వాహకులు తెలిపారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని(ఫిబ్రవరి 21) పురస్కరించుకుని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏపీ భాషా సాంస్కృతికశాఖ ముఖ్య కార్యనిర్వహణ అధికారి ఆర్. మల్లికార్జున రావు పాల్గొంటారు.
