20 ఏళ్ల సుదీర్ఘ యుద్ధం వల్ల అమెరికా కంటే అఫ్గాన్ ప్రజలకే ఎక్కువ నష్టం వాటిల్లిందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆఫ్గన్ ప్రజలకు నాగరికత నేర్పేందుకు, సంస్కరించేందుకు అమెరికా సైన్యం 20 సంవత్సరాలపాటు ప్రయత్నించిందని అన్నారు. సొంత నియామాలు, జీవిన ప్రమాణాలను ప్రవేశపెట్టాలని చూసిందని చెప్పారు. చివరకు విషాదం, నష్టం మాత్రమే మిగిలాయని పేర్కొన్నారు. అనుకున్న ఫలితం రాలేదన్నారు. ఎవరికైనా ఏదైనా చేయాలనుకుంటే ముందుగా వారి చరిత్రను సమగ్రంగా తెలుసుకోవాలని, వారి సంస్కృతిని అలవర్చుకోవాలని, సంప్రదాయాలను గౌరవించాలని వెల్లడిరచారు. అఫ్గానిస్థాన్‌లో 20 ఏళ్ల పాటు యుద్ధం చేసిన అమెరికా చివరకు సాధించింది శూన్యమని అన్నారు.