డా. రాజేంద్రప్రసాద్, అర్చన జంటగా.. రూపేష్, ఆకాంక్షసింగ్ మరో జంటగా రూపొందిన కుటుంబకథాచిత్రం షష్టిపూర్తి. పవన్ ప్రభ దర్శకత్వంలో రూపేష్ నిర్మించిన ఈ చిత్రం మే 30న విడుదలైంది. హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా సక్సెస్‌మీట్‌లో రాజేంద్రప్రసాద్ మాట్లాడారు. షష్టిపూర్తి అనేది కల్ట్ బ్లాక్ బస్టర్. పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకూ ఏ నటుడికీ దక్కని సినీ ప్రయాణం నాకు దక్కింది. కొడుకు కథ చెబుతూనే తల్లిదండ్రుల గురించి అద్భుతం గా చూపించారు దర్శకుడు పవన్ ప్రభ. ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలి. నిర్మాతగా రూపేష్ గొప్ప స్థాయికి వెళ్తాడు. ఇలాంటి అద్భుతమైన పాత్రలు నా తుది శ్వాస వరకు చేయాలని కోరుకంటున్నా అని అన్నారు.

ఇళయరాజా, తోట తరణి, రాజేంద్రప్రసాద్, అర్చన వంటి దిగ్గజాలు పనిచేసిన సినిమా ఇదని, రాజేంద్రప్రసాద్ లేకుండా ఈ సినిమా లేదని హీరో, నిర్మాత రూపేష్ చెప్పారు. ప్రేమని, కుటుంబ విలువల్ని నమ్ముకొని ఈ సినిమా చేశామని, సినిమాకు వస్తున్న స్పందన చూస్తుంటే చాలా సంతృప్తిగా ఉందని దర్శకుడు పవన్‌ప్రభ తెలిపారు.
