హిందువులపై హింస పాకిస్థాన్‌లో కన్నా బంగ్లాదేశ్‌లో ఎక్కువగా జరుగుతున్నదని భారత ప్రభుత్వం తెలిపింది. 2024లో హిందువులపై హింసాత్మక ఘటనలకు సంబంధించిన కేసులు బంగ్లాదేశ్‌లో 2,200, పాక్‌లో 112 వెలుగులోకి వచ్చినట్లు చెప్పింది. బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత హిందువులపై హింస విపరీతంగా పెరిగిందని తెలిపింది. 2022లో వీరిపై హింసాత్మక సంఘటనలు బంగ్లాదేశ్‌లో 241, పాక్‌లో 47 జరిగాయని, 2023లో బంగ్లాదేశ్‌లో 302, పాకిస్థాన్‌లో 103 జరిగాయని పేర్కొంది. విదేశాంగ శాఖ శుక్రవారం రాజ్యసభకు ఈ వివరాలు తెలిపింది.