ప్రముఖ దర్శకులు ముత్యాల సుబ్బయ్య సమర్పణలో రూపొందుతున్న చిత్రం తల్లి మనసు. రచిత మహా లక్ష్మీ , కమల్ కామరాజు, సాత్విక్, సాహిత్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వి.శ్రీనివాస్ (సిప్పీ) దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ముత్యాల అనంతకిషోర్ నిర్మాత. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుగుతున్నది. రెండు పాటలతో పాటు 80శాతం చిత్రీకరణ పూర్తయిందని, ఈ నెలాఖరుకు షూటింగ్ మొత్తం పూర్తవుతుందని నిర్మాత ముత్యాల అనంతకిషోర్ తెలిపారు. ఓ మధ్యతరగతి తల్లి పడే తపన, సంఘర్షణను ఆవిష్కరిస్తూ, వాస్తవ జీవితానికి దగ్గరగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని సమర్పకులు ముత్యాల సుబ్బయ్య తెలిపారు. రఘుబాబు, శుభలేఖ సుధాకర్ తదితరులు నటిస్తున్నారు.ఈ చిత్రానికి కథా విస్తరణ: ముత్యాల సుబ్బయ్య, సంగీతం: కోటి, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.శ్రీనివాస్ (సిప్పీ).