Namaste NRI

చివరి దశలో తల్లి మనసు షూటింగ్

ప్రముఖ దర్శకులు ముత్యాల సుబ్బయ్య సమర్పణలో రూపొందుతున్న చిత్రం తల్లి మనసు. రచిత మహాలక్ష్మీ, కమల్‌ కామరాజు, సాత్విక్‌, సాహిత్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వి.శ్రీనివాస్‌ (సిప్పీ) దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ముత్యాల అనంతకిషోర్‌ నిర్మాత. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుగుతున్నది. రెండు పాటలతో పాటు 80శాతం చిత్రీకరణ పూర్తయిందని, ఈ నెలాఖరుకు షూటింగ్‌ మొత్తం పూర్తవుతుందని నిర్మాత ముత్యాల అనంతకిషోర్‌ తెలిపారు. ఓ మధ్యతరగతి తల్లి పడే తపన, సంఘర్షణను ఆవిష్కరిస్తూ, వాస్తవ జీవితానికి దగ్గరగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని సమర్పకులు ముత్యాల సుబ్బయ్య తెలిపారు. రఘుబాబు, శుభలేఖ సుధాకర్‌ తదితరులు నటిస్తున్నారు.ఈ చిత్రానికి కథా విస్తరణ: ముత్యాల సుబ్బయ్య, సంగీతం: కోటి, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.శ్రీనివాస్‌ (సిప్పీ).

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress