
త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ, అనీష్ కురువిల్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం మిస్టర్ వర్క్ ఫ్రమ్ హౌమ్. మధుదీప్ చెలికాని రచన, దర్శకత్వం వహించారు. సిహెచ్.వి.ఎస్.ఎన్.బాబ్జీ సమర్పణలో లోటస్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై అరవింద్ మండెం నిర్మించారు. ఈ చిత్ర టీజర్ గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ఈ సందర్భంగా త్రిగుణ్ మాట్లాడుతూ వ్యవసాయం అవశ్యకతను నేటి తరానికి తెలియజేస్తూ సందేశాత్మక కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించామని చెప్పారు. నవతరం యువత జీవనశైలిని చూపిస్తూనే వ్యవసాయం గొప్పదనాన్ని ఈ చిత్రంలో చర్చించామన్నారు. వ్యవసాయం చేసే విధానంలో మార్పు రావాలనే అంశాన్ని చర్చిస్తూ మెసేజ్ ఓరియెంటెడ్‌గా సినిమా తీశామని దర్శకుడు మధుదీప్ పేర్కొన్నారు. వినోదంతో పాటు అద్భుతమైన సందేశం కలబోసిన చిత్రమిదని నిర్మాత అరవింద్ చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రకాష్ చెరుకూరి, దర్శకత్వం: మధుదీప్ చెలికాని.















