Namaste NRI

డోనాల్డ్ ట్రంప్ పార్టీకి మ‌స్క్ భారీ విరాళం

అమెరికా బిలియ‌నీర్ ఎల‌న్ మ‌స్క్‌  డోనాల్డ్ ట్రంప్ పార్టీకి భారీగా విరాళాలు ఇచ్చారు. రాబోయే అధ్య‌క్ష ఎన్నిక‌ ల్లో రిప‌బ్లిక‌న్ పార్టీ త‌ర‌పున మ‌రోసారి ట్రంప్ పోటీలో ఉండ‌నున్నారు. అయితే ట్రంప్ త‌ర‌పున ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హిస్తున్న అమెరికా ప్యాక్ అనే కంపెనీకి మ‌స్క్ భారీ స్థాయిలో విరాళాలు ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. అయితే ట్రంప్ కోసం ప‌నిచేసే అమెరికా ప్యాక్ సంస్థ‌కు మ‌స్క్ ఎంత ఇచ్చార‌న్న విష‌యం ఇంకా స్ప‌ష్టంగా తెలియ‌దు. కానీ ఆ సంస్థ మాత్రం ఈనెల లోనే డోనార్ల జాబితాను రిలీజ్ చేయ‌నున్న‌ది. రిప‌బ్లిక్ పార్టీ అభ్య‌ర్థి గా వ‌చ్చే వారం డోనాల్డ్ ట్రంప్‌ను నామినేట్ చేసే అవ‌కాశాలు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో మ‌స్క్‌తో పాటు ఇత‌ర సంప‌న్న దాత‌ల‌ను ఇటీవ‌ల ట్రంప్ క‌లుసుకున్నారు. అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో డెమోక్ర‌టిక్ అభ్యర్థిగా పోటీ చేయ‌ను న్న బైడెన్‌పై మ‌స్క్ ఇటీవ‌ల విమ‌ర్శ‌లు చేసిన విష‌యం తెలిసిందే.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events