శివ కందుకూరి హీరోగా పురుషోత్తం రాజ్ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం భూతద్దం భాస్కర్ నారాయణ. స్నేహాల్, శశిధర్ నిర్మిస్తున్నారు. ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. దర్శకుడు మాట్లాడుతూ పదేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను. ఈ సినిమాతో నా కల నెరవేరింది. దిష్టిబొమ్మ నేపథ్యంలో ఆద్యంతం ఉత్కంఠభరితం గా సాగే కథ ఇది. హారర్ సినిమాల్లో సరికొత్తగా ఉంటుంది. ప్రతి క్షణం అనూహ్య మలుపులతో భయాన్ని రేకెత్తిస్తుంది’ అన్నారు. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్‌కు అద్భుతమైన స్పందన లభించిందని, గీతా డిస్ట్రిబ్యూషన్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుందని హీరో శివ కందుకూరి తెలిపారు. మంచి సబ్జెక్ట్ ఇదని, ఎక్కడా రాజీపడకుండా తెరకెక్కించారని రాజ్ కందుకూరి అన్నారు. ప్రేక్షకులకు గొప్ప థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ అందించే చిత్రమిదని, హారర్ సబ్జెక్ట్స్‌లో ఇదొక ప్రయోగంగా నిలిచిపోతుందని నిర్మాతలు స్నేహాల్, శశిధర్ పేర్కొన్నారు. ఈ చిత్రం మార్చి 1న ప్రేక్షకుల ముందుకురానుంది.