Namaste NRI

సమర్థులు రావాలని నా ఆకాంక్ష :  ట్రంప్

హెచ్1బి గెస్ట్ వర్కర్స్ వీసాపై రెండు పక్షాల వాదనను ఇష్టపడతానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. అమెరికాకు అత్యంత సమర్థులైన, ఘనులైన వ్యక్తుల అవసరం ఉందని. అది ఈ వీసా కార్యక్రమం ద్వారా సాధ్యం అవుతుందని ట్రంప్ తెలిపారు. తాను కూడ హెచ్1బి వీసా కార్యక్రమాన్ని వినియోగించుకున్నానని ట్రంప్ తెలియజేశారు. సైద్ధాంతిక లేదా సాంకేతిక నైపుణ్యం అవసరమైన ప్రత్యేక ఉద్యోగాల్లో విదేశీ కార్మికులను నియమించు కోవడానికి యుఎస్ కంపెనీలను అనుమతించే నాన్ ఇమ్మిగ్రంట్ వీసా హెచ్1బి వీసా. భారత్, చైనా వంటి దేశాల నుంచి ఏటా అనేక వేల మంది ఉద్యోగులను నియమించుకోవడానికి టెక్నాలజీ సంస్థలు ఆ వీసాపైనే ఆధారపడుతుంటాయి.

నాకు రెండు వైపుల వాదనలు ఇష్టం. అయితే, శిక్షణ గరపడంతో ముడిపడి ఉన్నప్పటికీ, తమ వంటి అర్హతలు లేని ఇతరులకు సాయం చేయవలసి వచ్చినప్పటికీ అత్యంత సమర్ధులైనవారు మా దేశంలోకి రావడాన్ని కూడా ఇష్టపడతాను. అయితే, దానిని ఆపాలని నేను కోరుకోవడం లేదు& ఇంజనీర్ల గురించే నేను మాట్లాడడం లేదు, అన్ని స్థాయిల్లోని వారి గురించే మాట్లాడుతున్నాను అని ట్రంప్ చెప్పారు. ఒరాకిల్ సిటిఒ లారీ ఎల్లిసన్, సాఫ్ట్‌బ్యాంక్ సిఇఒ మసయోషి సోన్, ఓపెన్ ఎఐ సిఇఒ శామ్ ఆల్ట్‌మన్‌లతో కలసి వైట్ హౌస్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడినప్పుడు ట్రంప్ ఆ వ్యాఖ్యలు చేశారు. తన మద్దతుదారుల్లోనే హెచ్1బి వీసాపై ప్రస్తుతం సాగుతున్న చర్చపై ఒక ప్రశ్నకు అధ్యక్షుడు అలా సమాధానం ఇచ్చారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events