Skip to main content

Namaste NRI

మిస్టీరియస్‌ టీజర్‌ లాంచ్‌

అలనాటి మహానటుడు రక్తకన్నీరు  నాగభూషణం మనవడు అబిద్‌భూషణ్‌ హీరోగా పరిచయం అవుతున్న సస్పెన్స్‌ థ్రిల్లర్‌  మిస్టీరియస్‌. రోహిత్‌ సహాని కథానాయిక. మహి కోమటిరెడ్డి దర్శకత్వంలో ఉషా, శివాని కలిసి నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా సినిమా టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌ని హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు.

ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించే సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ఇదని దర్శకుడు మహి తెలిపారు. రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మించామని, భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలు నిర్మిస్తామని నిర్మాతలు చెప్పారు. ఇంకా చిత్ర యూనిట్‌ సభ్యులందరూ మాట్లాడారు. రియా కపూర్‌, మేఘనా రాజపుత్‌, బలరాజ్‌ వాడి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈచిత్రానికి కెమెరా, ఎడిటింగ్‌: పరవస్తు దేవేంద్ర సూరి.

Social Share Spread Message

Latest News