నిఖిల్ నటిస్తున్న తాజా చిత్రం స్వయంభూ. నభా నటేష్ కథానాయికగా. భరత్ కృష్ణమాచారి దర్శకుడు. భువన్, శ్రీకర్ నిర్మాతలు. పీరియాడిక్ వార్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో హీరో నిఖిల్ వారియర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇదిలా వుండగా కథానాయిక నభా నటేష్ జన్మదినం. ఈ సందర్భంగా సుందరవల్లి అనే పాత్రలో నభా నటేష్ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. కథాగమనంలో సుందరవల్లి పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుందని, రాజసం కలబోసిన మహారాణిగా ఆకట్టుకుంటుందని చిత్ర బృందం పేర్కొంది. ప్రస్తుతం స్వయంభూ చిత్రీకరణ జరుపుకుంటున్నది. ఈ చిత్రానికి సంగీతం: రవి బస్రూర్, రచన-దర్శకత్వం: భరత్ కృష్ణమాచారి.