Skip to main content

Namaste NRI

స్వయంభూ నుంచి నభా నటేష్ బర్త్ డే పోస్టర్ రిలీజ్

నిఖిల్‌ నటిస్తున్న తాజా చిత్రం స్వయంభూ. నభా నటేష్‌ కథానాయికగా. భరత్‌ కృష్ణమాచారి దర్శకుడు. భువన్‌, శ్రీకర్‌ నిర్మాతలు. పీరియాడిక్‌ వార్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో హీరో నిఖిల్‌ వారియర్‌ పాత్రలో కనిపించనున్నాడు. ఇదిలా వుండగా  కథానాయిక నభా నటేష్‌ జన్మదినం. ఈ సందర్భంగా సుందరవల్లి అనే పాత్రలో నభా నటేష్‌ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. కథాగమనంలో సుందరవల్లి పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుందని, రాజసం కలబోసిన మహారాణిగా ఆకట్టుకుంటుందని చిత్ర బృందం పేర్కొంది. ప్రస్తుతం స్వయంభూ చిత్రీకరణ జరుపుకుంటున్నది. ఈ చిత్రానికి సంగీతం: రవి బస్రూర్‌, రచన-దర్శకత్వం: భరత్‌ కృష్ణమాచారి.

Social Share Spread Message

Latest News