కిరణ్ అబ్బవరం, సంజన ఆనంద్ జంటగా నటిస్తున్న చిత్రం నేను మీకు బాగా కావాల్సినవాడిని. శ్రీధర్ గాదె దర్శకుడు. కోడి దివ్యదీప్తి నిర్మిస్తున్నారు.ఈ సినిమా నుంచి నచ్చావ్ అబ్బాయి అనే పాటను విడుదల చేశారు. భాస్కరభట్ల రచించిన ఈ గీతానికి మణిశర్మ స్వరాల్ని అందించారు. ఇటీవల విడుదల చేసిన టీజర్‌కు మంచి స్పందన లభించింది. సెప్టెంబర్ 9న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం అని చిత్రబృందం తెలిపింది. కుటుంబ అనుబంధాలు, భావోద్వేగాలతో ఆకట్టుకునే కథాంశమిదని నిర్మాత కోడి దివ్వదీప్తి తెలిపారు. సోనూ ఠాకూర్, సిద్ధార్థ్‌మీనన్, యస్వీ కృష్ణారెడ్డి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రాజ్ నల్లి, సంగీతం: మణిశర్మ, దర్శకత్వం: శ్రీధర్ గాదె. ఈ కార్యక్రమంలో సంజన, భరత్ రొంగలి, రాజ్ కె. నల్లి తదితరులు పాల్గొన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)