చైతన్యరావు, హెబ్బాపటేల్ జంటగా రూపొందిన చిత్రం హనీమూన్ ఎక్స్‌ప్రెస్. బాలరాజశేఖరుని దర్శకుడు. కె.కె.ఆర్, బాలరాజ్ నిర్మాతలు. తనికెళ్లభరణి, సుహాసిని, అలీ, సురేఖవాణి తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఈ చిత్రం తొలి పోస్టర్‌ని అక్కినేని నాగార్జున విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దర్శకుడు బాల మా అన్నపూర్ణ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌కి డీన్. హాలీవుడ్ సినీనిర్మాణ పరిజ్ఞానాన్ని మా విద్యార్థులకు పంచి ఇవ్వడమేకాక, మా విద్యార్థులకు, అధ్యాపకులకూ హానీమూన్ ఎక్స్‌ప్రెస్ చిత్రంలో అవకాశాలు ఇచ్చాడు. వినోదంతోపాటు ఈ కథలో చక్కని సందేశంకూడా ఉంటుంది. కల్యాణీమాలిక్ రొమాంటిక్ సంగీతాన్నిచ్చాడు. ఈ సినిమా మంచి విజయం సాధించాలి అని అన్నారు.
హాలీవుడ్‌లో పనిచేసిన తనకు తెలుగు సినిమా చేయడం కల అని, నాగార్జున దంపతుల ప్రోద్బలంతో తెలుగు సినిమా చేయగలిగానని దర్శకుడు చెప్పారు. త్వరలోనే సినిమాను విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి నేపథ్య సంగీతం: ఆర్.పి.పట్నాయక్, కెమెరా: శిష్టా వి.ఎం.కె.