Skip to main content

Namaste NRI

హనీమూన్ ఎక్స్‌ప్రెస్‌కు ..నాగార్జున గ్రీన్ సిగ్నల్

చైతన్యరావు, హెబ్బాపటేల్‌ జంటగా రూపొందిన చిత్రం హనీమూన్‌ ఎక్స్‌ప్రెస్‌. బాలరాజశేఖరుని దర్శకుడు. కె.కె.ఆర్‌, బాలరాజ్‌ నిర్మాతలు. తనికెళ్లభరణి, సుహాసిని, అలీ, సురేఖవాణి తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఈ చిత్రం తొలి పోస్టర్‌ని అక్కినేని నాగార్జున విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దర్శకుడు బాల మా అన్నపూర్ణ ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌కి డీన్‌. హాలీవుడ్‌ సినీనిర్మాణ పరిజ్ఞానాన్ని మా విద్యార్థులకు పంచి ఇవ్వడమేకాక, మా విద్యార్థులకు, అధ్యాపకులకూ హానీమూన్‌ ఎక్స్‌ప్రెస్‌ చిత్రంలో అవకాశాలు ఇచ్చాడు. వినోదంతోపాటు ఈ కథలో చక్కని సందేశంకూడా ఉంటుంది. కల్యాణీమాలిక్‌ రొమాంటిక్‌ సంగీతాన్నిచ్చాడు. ఈ సినిమా మంచి విజయం సాధించాలి అని అన్నారు.

హాలీవుడ్‌లో పనిచేసిన తనకు తెలుగు సినిమా చేయడం కల అని, నాగార్జున దంపతుల ప్రోద్బలంతో తెలుగు సినిమా చేయగలిగానని దర్శకుడు చెప్పారు. త్వరలోనే సినిమాను విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి నేపథ్య సంగీతం: ఆర్‌.పి.పట్నాయక్‌, కెమెరా: శిష్టా వి.ఎం.కె.

Social Share Spread Message

Latest News