మంచి హిట్ కోసం కొన్నాళ్లుగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ వస్తున్నారు కళ్యాణ్ రామ్. తాజాగా ఆయన హీరోగా నటిస్తూ, స్వీయ నిర్మాణంలో రూపొందిస్తున్న చిత్రం బింబిసార. ఎ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్ అన్నది ఉపశీర్షిక. ఓ సమూహం తాలుకూ దైర్యానిన ఓ ఖడ్గం శాసిస్తే, కొన్ని వందల రాజ్యాలు ఆ ఖడ్గానికి తలవంచి బానిసలైతే ఇందరి భయాన్ని చూస్తూ ఒకరితో ఓ రాజ్యం మీసం మెలేసింది. అదే త్రిగర్తల సామ్రాజ్యపు నెత్తుటి సంతకం.. బింబిసారుడి ఏకచత్రాధిపత్యం అనే డైగాల్‌తో బింబిసార సినిమా టీజర్ విడుదలైంది. ఈ చిత్రంలో కేథరిన్, సంయుక్తా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వశిష్ట దర్శకత్వంలో నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై హరికృష్ణ. కె నిర్మించారు. పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో నిర్మించిన చిత్రమిది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్నారు హరికృష్ణ. ఈ చిత్రానికి కెమెరా: ఛోటా కె. నాయుడు, సంగీతం: చిరంతన్ భట్, డైరెక్టర్ ఆఫ్ మ్యూజిక్ : సంతోష్ నారాయణ్. ఈ సినిమా తెలుగుతో పాటు అన్ని ప్రధాన భారతీయ భాషల్లో విడుదల కానుంది. త్వరలో విడుదల తేదీ ప్రకటించనున్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)