Skip to main content

Namaste NRI

నందమూరి కళ్యాణ్ రామ్ బింబిసార టీజర్ వచ్చేసింది

మంచి హిట్‌ కోసం కొన్నాళ్లుగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ వస్తున్నారు కళ్యాణ్‌ రామ్‌.  తాజాగా ఆయన హీరోగా నటిస్తూ, స్వీయ నిర్మాణంలో రూపొందిస్తున్న చిత్రం బింబిసార. ఎ టైమ్‌ ట్రావెల్‌ ఫ్రమ్‌ ఈవిల్‌ టు గుడ్‌ అన్నది ఉపశీర్షిక. ఓ సమూహం తాలుకూ దైర్యానిన ఓ ఖడ్గం శాసిస్తే, కొన్ని వందల రాజ్యాలు ఆ ఖడ్గానికి తలవంచి బానిసలైతే ఇందరి భయాన్ని చూస్తూ ఒకరితో ఓ రాజ్యం మీసం మెలేసింది. అదే త్రిగర్తల సామ్రాజ్యపు నెత్తుటి సంతకం.. బింబిసారుడి ఏకచత్రాధిపత్యం అనే డైగాల్‌తో బింబిసార సినిమా టీజర్‌ విడుదలైంది. ఈ చిత్రంలో కేథరిన్‌, సంయుక్తా మీనన్‌  హీరోయిన్లుగా నటిస్తున్నారు. వశిష్ట దర్శకత్వంలో నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ పతాకంపై హరికృష్ణ. కె నిర్మించారు. పీరియాడిక్‌ బ్యాక్‌డ్రాప్‌లో నిర్మించిన చిత్రమిది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్నారు హరికృష్ణ. ఈ చిత్రానికి కెమెరా: ఛోటా కె. నాయుడు, సంగీతం: చిరంతన్‌ భట్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ మ్యూజిక్‌ : సంతోష్‌ నారాయణ్‌. ఈ సినిమా తెలుగుతో పాటు అన్ని ప్రధాన భారతీయ భాషల్లో విడుదల కానుంది. త్వరలో విడుదల తేదీ ప్రకటించనున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events