అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో ఉన్న భారతీయ అమెరికన్ ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ ఆరోగ్యంపై ఇటీవలే ఆందోళన వ్యక్తమైన విషయం తెలిసిందే. ఐఎస్‌ఎస్‌లో సునీతా విలియమ్స్ బరువు తగ్గినట్లుగా, నీరసంగా ఉన్నట్లు ఓ ఫొటో ఇటీవలే బయటకు వచ్చింది. దీంతో ఆమె తీవ్ర పోషకార లోపాన్ని ఎదుర్కొంటున్నారని, అందువల్లనే ఆమె బలహీనంగా కనిపిస్తున్నారంటూ వార్తలు వచ్చాయి.

దీంతో సునీతా విలియమ్స్ ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం అయింది. ఈ వార్తలపై నాసా తాజాగా స్పందించింది. ఆస్ట్రోనాట్ ఆరోగ్య పరిస్థితిపై క్లారిటీ ఇచ్చింది. సునీతా విలియమ్స్ సహా అంతరిక్ష కేంద్రంలో ఉన్న వ్యోమగాములంతా పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని తెలిపింది. వ్యోమగాములకు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు జరుగుతాయని, ఫ్లైట్ సర్జన్లు పర్యవేక్షిస్తారని వెల్లడించింది.
